Monday, April 7, 2025
Homeలేటెస్ట్ న్యూస్కవితకు బిగ్ షాక్..

కవితకు బిగ్ షాక్..

బెయిల్ నిరాకరించిన హై కోర్టు
స్పాట్ వాయిస్, బ్యూరో: కవిత బెయిల్ పై ఉత్కంఠకు తెరపడింది. సోమవారం కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఆమె దాఖలు చేసిన రెండు బెయిల్‌ పిటిషన్లను తిరస్కరిస్తూ ఢిల్లీ ధర్మాసనం తీర్పునిచ్చింది. మద్యం విధానం ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ, జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు వెలువరించారు. ఈడీ, సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకుంటూ కవితకు బెయిల్ నిరాకరించారు. కాగా ఢిల్లీ లిక్కర్​ స్కాం కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments