Tuesday, April 8, 2025
Homeలేటెస్ట్ న్యూస్రాజీ లేదు.. రాజీనామే..!

రాజీ లేదు.. రాజీనామే..!

రాజీ లేదు.. రాజీనామే..!
కాంగ్రెస్ లో చేరికల చిచ్చు..
మధ్యాహ్నం మండలి చైర్మన్ కలువనున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

స్పాట్ వాయిస్, బ్యూరో: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పార్టీలో తనకు జరిగిన అవమానానికి రగిలిపోతున్నారు. ఎంత బుజ్జగించినా తగ్గేదే లే అంటున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనటలు తెలుస్తోంది. ఇది పదవుల పంచాయితీ కాదని, వ్యక్తిత్వానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు.తాను చేయని పదవి లేదని, అధికారం కొత్తకాదని తెలిపారు. 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ జరగని అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తాజాగా జగిత్యాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం. సంజయ్‌ మూడు రోజుల కిందట ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇక అప్పటి నుంచి ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అలకబూనినాడు. సంజయ్‌ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన ప్రమేయం లేకుండానే జరగాల్సింది అంతా జరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, జీవన్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌ బాబు, ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణరావు, ఆది శ్రీనివాస్‌లతోపాటు ఎమ్మెల్యేలు రాజ్‌ ఠాకూర్‌, ప్రేమసాగర్‌ రావులతోపాటు పలువురు నాయకులు బుజ్జగించారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ కూడా పోన్‌ ద్వారా ఆయనతో మాట్లాడి సర్దిచెప్పేందుకు యత్నించారు. ఎవరు ఎన్ని చెప్పినా…తను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డిని కలిసి…తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నట్లు సమాచారం.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments