ఆలక వీడేనా..? పట్టు మీద ఉండేనా..!
మంత్రి పదవి ఇస్తారని జోరుగా చర్చ..
స్పాట్ వాయిస్, బ్యూరో: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లొల్లి ఢిల్లీకి చేరింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తీవ్ర మనస్తాపానికి గరైన జీవన్ రెడ్డి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబు ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి. దీంతో తాజాగా జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఢిల్లీకి చేరుకుంది. బుధవారం ఉదయం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్ జీవన్ రెడ్డికి ప్రత్యేకంగా ఫోన్ చేసి వెంటనే ఢిల్లీకి రావాలని ఆదేశించారు. దీంతో ఢిల్లీలో ఉన్న దీపాదాస్ మున్షీని కలిసేందుకు జీవన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఇక సీనియర్ నేత అయిన జీవన్ రెడ్డి మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం సైతం జోరుగా నడుస్తోంది. ఇదిలా ఉంటే బుధవారం ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు, ప్రధానంగా జీవన్ రెడ్డి విషయంలో అధిష్టానంతో చర్చించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, జూపల్లి ఉన్నారు.
ఢిల్లీకి చేరిన జీవన్ రెడ్డి లొల్లి..
RELATED ARTICLES
Recent Comments