Thursday, November 21, 2024
Homeతెలంగాణఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి హత్య

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి హత్య

తీవ్ర ఉద్వేగానికి గురైన జీవన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీకో దండం అంటూ అసహనం..

స్పాట్ వాయిస్, క్రైం: జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మారు గంగారెడ్డిని గుర్తు తెలియని దుండగులు మంగళవారం హత్య చేశారు. జగిత్యాలలో గంగారెడ్డి హత్యకు నిరసనగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధర్నాకు దిగారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రోద్బలం వల్లే గంగారెడ్డి హత్య అని ఆరోపించారు. , సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

 

మీ పార్టీకో దండం..
‘ మీకు.. మీ పార్టీకి ఓ దండం.. ఇకనైనా మమ్మల్ని బతనివ్వండి’ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రధాన అనుచరుడు, జగిత్యాల రూరల్‌ మండలం జాబితాపూర్‌ మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి (58)ని దారుణంగా హత్య చేయడంతో రాష్ట్రంలోని శాంతిభద్రతలపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గంగారెడ్డి హత్యను నిరసిస్తూ తన అనుచరులతో కలిసి జగిత్యాల-ధర్మపురి రహదారిపై జీవన్‌ రెడ్డి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌తో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ మాకు నలుగురికి సేవ చేయడమే తెలుసు.. ఏదైనా స్వచ్ఛంద సంస్థ పెట్టుకుని అయినా ప్రజలకు సేవ చేస్తా. ఇక మీకు.. మీ పార్టీకి ఓ దండం. ఇకనైనా మమ్మల్ని బతకనివ్వండి. ఇంతకాలం అవమానాలకు గురైనా తట్టుకున్నాం.. మానసికంగా అవమానాలకు గురవుతున్నా భరించాం.. కానీ ఇప్పుడు భౌతికంగా లేకుండా చేస్తే ఎందుకు.’అని అడ్లూరి లక్ష్మణ్‌ను జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు. తన అనుచరుడిని హత్య చేయడం అంటే తనను కూడా హత్య చేసినట్లే అని ఈ సందర్భంగా జీవన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. గంగారెడ్డిని చంపిన వారిని పట్టుకోవాలని పోలీసులను డిమాండ్‌ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments