Saturday, September 21, 2024
Homeరాజకీయంఇంత దారుణం ఎక్కడ చూడలే..

ఇంత దారుణం ఎక్కడ చూడలే..

ఏకపక్షంగా లీడ్ ప్రకటిస్తున్నారు..
అడిగితే పోలీసులతో గెంటించేస్తున్నారు..
లెక్కింపులో తేడాలున్నాయి..
పారదర్శకంగా నిర్వహించాలి..
ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి
స్పాట్ వాయిస్, బ్యూరో: న‌ల్లగొండ – ఖ‌మ్మం- వ‌రంగ‌ల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపులో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌ని, ఏక‌ప‌క్షంగా ఫ‌లితాలు ప్రక‌టిస్తున్నార‌ని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి ఆరోపించారు. న‌ల్లగొండ కౌంటింగ్ కేంద్రంలో ఆర్వో తీరును నిర‌సిస్తూ గురువారం సాయంత్రం రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. త‌న గెలుపును అడ్డుకునేందుకు ఓట్ల లెక్కింపులో అనేక అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి త‌మ ఏజెంట్స్‌ను బ‌య‌ట‌కు పంపించేస్తున్నారని, ఏక‌ప‌క్షంగా ఫ‌లితాలు ప్రక‌టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రౌండ్లు పూర్తయిన త‌ర్వాత క‌నీసం త‌మ ఏజెంట్స్ వ‌ద్ద సంత‌కాలు కూడా తీసుకోవ‌డం లేదని, ఆర్వోను క‌లిసేందుకు వెళ్తే పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పారు. 3 గంటల పాటు ఆర్‌వో ఆఫీస్ వద్ద పడిగాపులు పడాల్సి వస్తుందని, 17 వేల పైచిలుకు మెజార్టీని 18 వేల పైచిలుకుగా ఏకపక్షంగా ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడో రౌండ్‌లో త‌మ అభ్యంత‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలని కోరారు. ప్రజ‌ల తీర్పును శిర‌సావ‌హిస్తామని, కానీ పారదర్శంగా కౌంటింగ్ జరపాల‌న్నది త‌మ‌ డిమాండ్ అన్నారు. ఒకే హాల్‌లో వెయ్యి ఓట్ల తేడా వచ్చిందని, రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరారు. కౌటింగ్ విషయం హాల్ 4 లో తమకు 530 మెజార్టీ ఉందని సమాచారమని, అయితే 3000 లీడ్ ఉందని తాము అంచనా వేస్తే డైరెక్ట్ 4000 లీడ్ అని ప్రకటించారని చెప్పారు. కౌంటింగ్ సజావుగా నిర్వహించాలని, ఆర్వో, ఎన్నికల అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని రాకేశ్ రెడ్డి చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ… ఆర్వో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యహరిస్తున్నారని, 3వ రౌండ్ లో 18,876 లీడ్ ఆర్వో ఏకపక్షంగా ప్రకటించి వెళ్లిపోయారని ఆరోపించారు. ప్రతి టేబుల్ పై 10 ఓట్ల మించి తేడాలు వస్తున్నాయని, తమ అభ్యర్థి ప్రశ్నిస్తే పోలీసులను పెట్టి బయటికి వెళ్లగోడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2వ ప్రాధాన్యత లో రాకేష్ రెడ్డి గెలుస్తాడని నమ్మకం ఉందని,
ఆ ఫలితాన్ని మార్చడం కోసం ఆర్వో పని చేస్తున్నారని, న్యాయ బద్ధంగా వ్యవహరించాలని, 3వ రౌండ్లో వచ్చిన లీడ్ ని మరోసారి పరిశీలించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments