Sunday, May 19, 2024
Homeతెలంగాణకోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ ఎన్నిక చెల్లదు..

కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ ఎన్నిక చెల్లదు..

కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ ఎన్నిక చెల్లదు..

తీర్పునిచ్చిన హైకోర్టు 

స్పాట్ వాయిస్, బ్యూరో : గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకాలపై ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ నియామకం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ను కొట్టివేసింది. దాసోజు శ్రవణ్‌, కూర సత్యనారాయణ ఎన్నికను గవర్నర్‌ పునర్‌పరిశీలించాలని ఆదేశించింది. మంత్రి మండలి నిర్ణయానికి గవర్నర్‌ కట్టుబడి ఉండాల్సిందేనని సూచించింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీ నియామకాలు చేపట్టాలని స్పష్టం చేసింది. దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ నియామకాన్ని కొట్టివేసే అధికారం గవర్నర్‌ లేదని పేర్కొంది. కేబినెట్‌కు తిప్పిపంపాలి తప్ప తిరస్కరించకూడదని వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments