ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, బల్మూరి
ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : తెలంగాణాలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తోపాటు ఎన్ఎస్ యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ పేర్లను పార్టీ హైకమాండ్ డిసైడ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం దయాకర్, వెంకట్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. కాగా, ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18వ తేదీన నామినేషన్ల దాఖలకు గడువు ముగియనుంది. ఈ మేరకు వారిద్దరి పేర్లను ఖరారు చేసిన హైకమాండ్ నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధం కావాలని సూచించారని సమాచారం. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరుకు తుంగతుర్తి టికెట్ ను అద్దంకి దయాకర్, హుజూరాబాద్ టికెట్ ను బల్మూరి వెంకట్ త్యాగం చేశారు. ఈ క్రమంలో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పోటీ నుంచి తప్పుకున్న ఆ ఇద్దరికి తాజాగా ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించింది.
Recent Comments