Monday, February 24, 2025
Homeటాప్ స్టోరీస్రాష్ట్రంలో మరో ఎన్నికల షెడ్యూల్ ..

రాష్ట్రంలో మరో ఎన్నికల షెడ్యూల్ ..

రాష్ట్రంలో మరో ఎన్నికల షెడ్యూల్ ..
5 ఎమ్మెల్సీ స్థానాలకు 3న నోటిఫికేషన్..
మార్చి 20 ఎన్నికలు..
స్పాట్ వాయిస్, బ్యూరో:  రాష్ట్రంలో మరో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. తెలంగాణలోని ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ను ప్రకటించింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 20వ తేదీన ఎన్నికలు ఉండనున్నాయి. తెలంగాణలో మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌, శేరి సుభాశ్‌ రెడ్డి, మల్లేశం ఎగ్గే, మీర్జా రియాజుల్‌ హాసన్‌ ఎఫెందీ పదవీకాలం మార్చి 30వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో వారి స్థానాల ఎన్నికలకు ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 3వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. 11వ తేదీన స్క్రూటినీ ఉంటుంది. మార్చి 13వ తేదీలోపు నామినేషన్లను ఉపసంహరణ. మార్చి 20 వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఎన్నికలు ఉండనున్నాయి. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు కౌంటింగ్‌ చేపట్టనున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments