ఎమ్మెల్యే ఈటల సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్
బీజేపీ ప్రలోభ పెట్టడం లేదు..
రాజీనామా చేసి వస్తేనే తీసుకుంటోంది..
స్పాట్ వాయిస్, హైదరాబాద్: తిట్టడం, బ్లాక్ మెయిల్, ఇతరుల మనసులు గాయపర్చడం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నైజమని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. పీసీసీ అధ్యక్ష స్థాయిలోనూ గత భాష, ప్రవర్తన, బ్లాక్ మెయిల్ మర్చిపోలేదన్నారు. బుధవారం ఈటల బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతున్నదన్నారు. ఇందులో భాగంగానే నిరాశ నిస్పృహలకు లోనై రేవంత్ మాట్లాడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నాయని, ఇది నిజం కాదా అనేది ఆయనే చెప్పాలన్నారు. మీ మిత్రపక్ష పార్టీలు అయిన హేమంత్ సోరేన్ కు, యూపీలో అఖిలేష్ కి, తమిళనాడులో స్టాలిన్ కి కేసీఆర్ పైసలు పంపింది వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ కలిసి మద్దతు తెలపలేదా? ఢిల్లీలో కేటీఆర్, రాహుల్ చెట్టా పట్టాలు వేసుకొని తిరగలేదా ? అన్నారు.
తాము ఫిరాయింపులు చేయడం లేదని, ప్రలోభ పెట్టడం లేదని, బాజాప్త బహిరంగంగా చేర్చుకుంటున్నామన్నారు. రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ లోకి పోవాలనుకుంటే ఆయనకు ఆరోజే మంత్రి అయ్యేవారు.. నేనే సాక్ష్యమన్నారు. కొట్లడత అన్నారు. కాంగ్రెస్ పార్టీలో హీరోయిజంగా కొట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వీడలేదన్నారు. కక్ష కట్టి, కాంట్రాక్ట్ రద్దు చేసిన, బిల్లులు ఆపినా టీఆర్ఎస్ లో చేరలేదని చెప్పారు. రాబోయే కాలంలో ఉండేది బీజేపీ కాబట్టి,రాజకీయ భవిష్యత్ ఉంటుందని బీజేపీకి వస్తున్నారని చెప్పారు. మాతో టచ్ లేని ఎమ్మెల్యే లేరని, వందలమంది సర్పంచ్లు, ఎంపీటీసీలు మాట్లాడుతున్నారని చెప్పారు. నల్లగొండ రేషానికి పుట్టినిల్లు అని, రాజీ పడని వారు,రజాకార్ల వ్యతిరేకంగా కొట్లడిన ప్రజలు వారన్నారు. ఇప్పుడొచ్చేది వ్యక్తుల మధ్య పోటీకాదని, టీఆర్ఎస్ పార్టీకి మునుగోడు ఆత్మాభిమానికి మధ్య జరుగుతున్న పోరన్నారు. విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ ఉమ్మడిజిల్లా జెడ్పీ చైర్మన్ తుల ఉమ, బీజేపీ నాయకులు ప్రేమెందర్ రెడ్డి, అశ్వద్ధామ రెడ్డి, అధికార ప్రతినిధి పాల్వాయి రజనీ, ప్రకాష్ రెడ్డి, అందే బాబయ్య, కరుణాకర్ పాల్గొన్నారు.
Recent Comments