బీఆర్ఎస్ జిల్లా నాయకుడు లెంకల రాజిరెడ్డి
కొడవటంచ ఆలయంలో మధుసూదనచారి అభిమానుల పూజలు
స్పాట్ వాయిస్ ,రేగొండ: భూపాలపల్లి అసెంబ్లీ టికెట్‌ను బీఆర్ఎస్ మాజీ శాసనసభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారికి కేటాయించాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు లేంకల రాజిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కొడవటంచ ఆలయంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి వర్గీయులు, అభిమానులు ఆయనకు టికెట్ రావాలని లక్ష్మీనరసింహుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. సుమారు 500 మంది ఆలయం చుట్టూ తిరుగుతూ రావాలి మధన్న ..కావాలి మధన్న అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా నాయకుడు లెంకల రాజిరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సమయంలో, తెలంగాణ ఉద్యమంలో మధుసూదనాచారి పాత్ర కీలకమన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కుగ్రామంగా ఉన్న భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా మార్చి, ఎనలేని అభివృద్ధి చేసిన ఘనత ఆయనదేనని కొనియాడారు. నియోజకవర్గంలో ప్రతీ బీద కుటుంబానికి ఎంతో కొంత సేవ చేసి తనకంటూ గొప్ప పేరు తెచ్చుకున్నాడని అన్నారు. మళ్లీ మధుసూదనాచారికి టికెట్ వస్తే గెలుపొందడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సదానందం, మాజీ పీఏసీఎస్ చైర్మన్ గోపు భిక్షపతి, నాయకులు కట్టంగూరి సుభాష్ రెడ్డి, సూర నర్సింగారావు, వావిలాల రమేష్, గుర్రాల సుమన్ రెడ్డి, చిలువేరు ఐలమల్లు గోగుల అశోక్ రెడ్డి, రూపిరెడ్డి లింగారెడ్డి, బోయిన వినోద్ కుమార్, మడికంటి ప్రభాకర్, కందకట్ల రాజు, తడక శ్రీకాంత్ గౌడ్, నడిపల్లి వెంకటరావు, అనుము రవి, బింగి బిక్షపతి, పసుల అశోక్, వాడికారి కిషన్ రావు, అన్నారపు రాజు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments