Wednesday, April 9, 2025
Homeలేటెస్ట్ న్యూస్ఏడ్చిన ఎమ్మెల్యే రాజయ్య

ఏడ్చిన ఎమ్మెల్యే రాజయ్య

ఏడ్చిన ఎమ్మెల్యే రాజయ్య
అక్కచెల్లెళ్లతో మాట్లాడలేకపోతున్న..
నేనేం తప్పు చేయలేదు..
స్పాట్ వాయిస్, జనగామ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య ఏడ్చారు. స్టేషన్ ఘనపూర్‌ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆయనపై వస్తున్న లైంగిక ఆరోపణల నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బుధవారం కరుణపురంలో ఫాదర్ కొలంబో జన్మదిన వేడుకలలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే కొందరు దిగజారి రాజకీయాలు చేస్తున్నారన్నారని చెప్పారు. దమ్ముంటే తనపై పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. తనకు కూతురుతో సమాన వయసున్న మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తానేమీ తప్పు చేయలేదన్నారు. శిఖండి రాజకీయాల‌తో త‌న అక్కచెల్లెళ్లతో కూడా ఆప్యాయంగా మాట్లాడలేకపోతున్నాని విలపించారు. తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాన‌ని, ఏ సర్వే చేసినా తాను ముందు వరుసలో ఉన్నానన్నారు. ఫాదర్ కొలొంబో ఆశీస్సులతో 5వ సారి ఎమ్మెల్యేగా తానే గెలుస్తానని చెప్పారు. ప్రతిపక్షాలు, ఇతరులు త‌న‌ను ఫెస్ టు ఫెస్ ఎదుర్కోలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. నేను ఏ రోజు రాజకీయాలు చేయలేదన్నారు. 2018 ఎలక్షన్ లో కూడా కొంతమంది నాయకులు త‌న‌ను ఎదుర్కోలేక ఇలాగే వ్యవహరిస్తూ ఆడియోలు, వీడియోలు రిలీజ్ చేసినా ప్రజలు అప్పటి ఎన్నిక‌ల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించారని గుర్తుచేశారు. ఎవ‌రు ఏం చేసినా ప్రజ‌లకు తాను ఏంటో తెలుస‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments