స్పాట్ వాయిస్ నర్సంపేట,(ఖానాపురం): ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పాకాల చెరువు మత్తడిపోస్తోంది. బుధవారం కురిసిన భారీ వర్షానికి పక్కన చెరువులోకి వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో గురువారం ఉదయం పాకాల మత్తడిపోస్తోంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం పాకాల సరస్సు మత్తడిని ఇంజనీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సందర్శించారు. వరద ఉధృతికి ప్రమాదపు అంచులో ఉన్న పాకాల కట్టను పరిశీలించి, వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలిచ్చారు. అనంతరం పాకాల సరస్సు కట్టపై ఉన్న గట్టమ్మ తల్లికి ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట ఓడీసీఎం ఎస్ చైర్మన్ రామస్వామి నాయక్ , ఎంపిపి ప్రకాష్ రావు , జెడ్పిటిసి స్వప్న శ్రీనివాస్, వైస్ ఎంపిపి, సర్పంచ్, ఆర్ ఎస్ ఎస్ కన్వీనర్, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.
Recent Comments