Tuesday, December 3, 2024
Homeజిల్లా వార్తలుసమాజానికి ప్రతి రూపం మహిళ :ఎమ్మెల్యే పెద్ది

సమాజానికి ప్రతి రూపం మహిళ :ఎమ్మెల్యే పెద్ది

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
క్రీడలనుపర్యవేక్షించిన ఎంపీపీ ఊడుగుల సునీత ప్రవీణ్ గౌడ్
స్పాట్ వాయిస్, నల్లబెల్లి : సమాజానికి ప్రతిరూపం మహిళా అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కారుణ్యజ్యోతి హై స్కూల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది, జెడ్పీ ఫ్లోర్ లీడర్, స్థానిక జడ్పీటీసీ పెద్ది స్వప్న ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ రకాల క్రీడల్లో మండలం నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండు రోజులుగా జరిగిన క్రీడలను ఎంపీపీ ఊడుగుల సునీత ప్రవీణ్ గౌడ్ దగ్గరుండి నడిపించారు. మంగళవారం నల్లబెల్లి మహిళా క్రీడలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించి మహిళలకు మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బానోతు సారంగపాని, వైస్ ఎంపీపీ గందే శ్రీలత శ్రీనివాస్ గుప్తా, తహసీల్దార్ మంజూల, రైతు బంధు సమతి మండల కో-ఆర్డినేటర్ గోనెల పద్మ, పార్టీ సీనియర్ నాయకుడు పాలేపు రాజేశ్వర్ రావు, మండల క్లస్టర్ ఇన్ చార్జి మామిండ్ల మోహన్ రెడ్డి, సర్పంచ్ లు రాజారాం, గోనె శ్రీదేవి, మల్లాడి కవిత, కో ఆప్షన్ సభ్యురాలు ఎం.డీ నజీమా, ఏపీఎం సునీత, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఊటుకూరి భాగ్యలక్ష్మి, కార్యదర్శి అనూష, సీసీలు కవిత, పద్మ, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments