“మహిళా బంధు” సంబురాల్లో ఎమ్మెల్యే పెద్ది
స్పాట్ వాయిస్ నర్సంపేట : మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని” పురస్కరించుకుని నిర్వహించిన మహిళా బంధు సంబురాల్లో భాగంగా ఆదివారం నర్సంపేట లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నెక్కొండ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో
తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఎన్నో మహిళా సంక్షేమ పథకాలతో మహిళా సాధికారత కొరకు కృషి చేస్తూ స్త్రీ శక్తిని ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీ కి రాఖీ కట్టి మహిళలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. నెక్కొండలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కి మహిళలు రాఖీ కట్టారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమం లో జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7, 8 తేదీల్లో ఆయా మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న మహిళా క్రీడోత్సవాల్లో అన్ని గ్రామాల నుండి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి గుంటి రజిని కిషన్, మహిళా కౌన్సిలర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Recent Comments