ఎమ్మెల్యే పాడిపై కోడి గుడ్లతో దాడి
టమాటాలు విసిరిన కాంగ్రెస్ నాయకులు
కమలాపూర్ గ్రామసభ
స్పాట్ వాయిస్ కమలాపూర్: మండల కేంద్రంలో ప్రజా పాలనలో భాగంగా నిర్వహిస్తున్న గ్రామ సభకు వచ్చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు ఎక్కడ జరుగుతుందని ప్రశ్నించడంతో మండల కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా కేకలు వేస్తుండడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి రాజకీయ బ్రోకర్లని మొన్నటిదాకా ఓ పార్టీలో ఉండి ఇప్పుడు మరొక పార్టీలో ఉంటున్నారని ఎద్దేవ చేస్తూ మాట్లాడడంతో క్రొపోద్దిత్తులైన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పై కోడిగుడ్లు టమాటాలను విసరారు. ఒక్కసారిగా గ్రామసభ ప్రాంగణమంతా భయానక వాతావరణం ఏర్పడింది. అక్కడున్న పోలీసులు ఇరు వర్గాల నాయకులకు సముదాయించే ప్రయత్నం చేశారు. ప్రజలు కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన హోదాను మరిచి చిల్లర మాటలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని అంటున్నారు.
Recent Comments