Thursday, September 19, 2024
Homeరాజకీయంఎమ్మెల్యే పాడి అరెస్ట్ కు రంగం సిద్ధం

ఎమ్మెల్యే పాడి అరెస్ట్ కు రంగం సిద్ధం

స్పాట్ వాయిస్, కమలాపూర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటీకి చైర్మన్‌గా నియామ‌క‌మైన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి బీఆర్ఎస్ కండువా క‌ప్పుతాన‌ని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటి వ‌ద్ద పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. కౌశిక్ రెడ్డి ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రాగానే ఆయ‌న‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు రెడీ అయినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయమే కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే గాంధీ ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సవాల్ మే సవాల్..
గురువారం అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి ఆయన తెలంగాణ భవన్ కు తీసుకువస్తానని కౌశిక్ రెడ్డి ప్రకటించారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యి ఆయన నివాసం ముందు మోహరించారు. మరోవైపు అరికెపూడి గాంధీ నివాసం వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అరికెపూడి గాంధీ సైతం కౌశిక్ రెడ్డికి రివర్స్ సవాల్ విసిరారు. ‘11 గంటలకు వస్తా అన్నావు.. రాకుంటే నేను నీ ఇంటికి 12 గంటలకు వస్తా.. నీ దమ్ము ఏంటో మా దమ్ము ఏంటో తేల్చుకుందాం’ అని అరేకపూడి గాంధీ ఛాలెంజ్ చేశారు. దీంతో ఇరువురి ఇంటి వద్దా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments