ఎమ్మెల్యే లాస్య నందిత కారును ఢికొన్న టిప్పర్ ఇదే..
ప్రమాదం ఎలా జరిగిందంటే..?
స్పాట్ వాయిస్, బ్యూరో: ఎమ్మెల్యే లాస్యనందిత కారును ఢీకొన్న టిప్పర్ ను పోలీసులు గుర్తించారు. గత నెల 23న కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రామేశ్వరం బండ సమీపంలో ఓఆర్ఆర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కారు నడుపుతున్న ఆకాశ్ నిద్ర మత్తులో ముందు వెళ్తున్న టిప్పర్‌ను బలంగా వెనక నుంచి ఢీకొట్టారు. అనంతరం ఓఆర్ఆర్ రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో ఎమ్మెల్యే మృతి చెందారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదం జరిగిన సమయంలో రింగ్‌రోడ్డు నుంచి ఏయే వాహనాలు వెళ్లాయో పరిశీలించిన పోలీసులు, వాటి డ్రైవర్లను విచారించారు. చివరకు టీఎస్ 08 యూజే 0025 అనే నంబరు గల టిప్పర్‌ను ఎమ్మెల్యే కారు ఢీకొన్నట్లు గుర్తించారు. టిప్పర్ వెనక భాగంలో ఉన్న సిగ్నల్ లైటు బోర్డు పగిలిపోయింది. కొద్దిగా పైభాగంలో ఉన్న గార్డు లాంటి ఇనుప భాగం పక్కకు వంగిపోయింది. పోలీసులు దీని డ్రైవర్‌ను గుర్తించి విచారిస్తున్నారు. అసలు ఆరోజు ఏం జరిగిందనే వివరాల కోసం ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ గుర్తించాడా? ఇబ్బందులు ఎదురవుతాయని ఎవరికీ సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయాడా? అనేది విచారిస్తున్నారు.
ఎమ్మెల్యే లాస్య నందిత కారును ఢికొన్న టిప్పర్ ఇదే..
RELATED ARTICLES
Recent Comments