Sunday, April 6, 2025
Homeజిల్లా వార్తలుబాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరామర్శ

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరామర్శ

స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: వర్ధన్నపేట మండల పరిధిలోని పలు బాధిత కుటుంబాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శనివారం పరామర్శించారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త లెల్లెల యాకనాథం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నాగరాజు యాకనాథం భౌతిక దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం అదే గ్రామానికి చెందిన మల్లెపాక శివకుమార్ ఖమ్మం రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి,మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరకుడు వెంకటయ్య, డైరెక్టర్ ఎద్దు శ్రీనివాస్, ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగొని ప్రభాకర్, వర్ధన్నపేట మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, టౌన్ అధ్యక్షుడు మైస సురేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పత్రి భాను ప్రసాద్, టెంపుల్ చైర్మన్ బుచ్చిమల్లు, సీనియర్ నాయకులు పోశాల వెంకన్న గౌడ్, మల్లెపాక సమ్మయ్య, ఐనవోలు ఆలయ డైరెక్టర్ గుంటి కుమారస్వామి, గడ్డం సమ్మయ్య, తుళ్ళ రవి, తీగల సునీత గౌడ్, కాంగ్రెస్ మండల , గ్రామ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments