రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్ పరిధిలోని కడిపికొండ గ్రామంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఏ.ఈ, డీఈ లతో కలిసి పరిశీలించారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజ్ లను, శిథిలావస్థలలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. వెంటనే స్మార్ట్ సిటీ ఫండ్స్ తో వాటికి శాశ్వత పరిష్కార మార్గాలను చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాజీపేట మండల అధ్యక్షుడు తోట్ల రాజు యాదవ్, 44వ డివిజన్ కార్పొరేటర్ జలగం అనిత – రంజిత్ రావు, 45వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సట్ల సదానంద గౌడ్, స్థానిక డివిజన్ సీనియర్ నాయకులు వెంకట రమణ, సుధాకర్, వేణు, ఇజ్జరిగిరి, గంగుల శ్రీనివాస్ రెడ్డి, రాము మండల నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments