వెలుగులు నింపేందుకే ‘దళిత బంధు’
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
స్పాట్ వాయిస్, గణపురం : దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని, వారి బంగారు భవిష్యత్ కు ‘బంధు’వులా చేయూతనందిస్తూ కొండంత ధైర్యాన్నిస్తున్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. దళిత బంధు పథకం ద్వారా రేగొండ మండలం రాయపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారుడికి యూనిట్ మంజూరు కాగా గణపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకున్న సూపర్ మార్కెట్ ను ఆదివారం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి గండ్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళితులు ఆర్థికంగా ఎదడానికి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ సీఎం కేసీఆర్ బాంధవుడయ్యారన్నారు. ఈ పథకంతో కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఈ పథకం ద్వారా చాలా మంది అభాగ్యులు జీవనోపాధి పొందుతారన్నారు. దళితులు ఈ యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదిగి, తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని, వారు మరో పది మందికి సహాయపడేలా ఎదగాలన్నారు. కాగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా దళితులంతా కేసీఆర్ వెంటే ఉంటారని ఆయన స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ధర్మారావుపేట గ్రామంలో రైతు మిత్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని, రైతులు మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమాల్లో సర్పంచులు నారగాని దేవేందర్ గౌడ్, పోతుల ఆగమ్మ, పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్ర రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోలుసాని లక్ష్మీనరసింహారావు, రేగొండ మండల అధ్యక్షుడు అంకం రాజేందర్, నాయకులు కోల జనార్దన్, మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ గౌడ్, కట్ల శంకరయ్య, కసిరెడ్డి వెంకటరమణారెడ్డి, డాక్టర్ జన్నయ్య, మోతే కరుణాకర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు గుర్రం తిరుపతి గౌడ్, ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు బోయిన సాంబయ్య ముదిరాజ్, హఫీజ్, దివి వంశీ నాయుడు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments