Sunday, September 22, 2024
Homeజిల్లా వార్తలుముందస్తు నాట్లకు సిద్ధం కావాలి..

ముందస్తు నాట్లకు సిద్ధం కావాలి..

ముందస్తు నాట్లకు సిద్ధం కావాలి

– ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి

-గణపసముద్రం నుంచి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

స్పాట్ వాయిస్, గణపురం: త్వరగా నాట్లు వేసి ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటను కాపాడుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రైతులకు సూచించారు. ఆదివారం గణపసముద్రం చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. వానకాలం పంటకోసం ప్రధాన కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరి పండించే రైతులు గత ఏడాది ఖరీప్‌ సాగు సమయంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వానాకాలం ముందస్తుగా నారు పోసుకొని నాట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. ముందస్తు నాట్లు వేయడం వల్ల యాసంగి పంట కూడా ముందస్తుకు వీలుంటుందని తెలిపారు. అలాగైతే రైతులు వర్షాల భారిన పడకుండా పంట చేతికందే అవకాశం ఉంటుందని, తద్వారా వడ్లు కొనుగోలు ప్రక్రియ సకాలంలో పూర్తవుతుందని అన్నారు. ముందస్తు నాట్లు వేసే విధంగా రైతులను చైతన్య పరచాలని అధికారులను ఆదేశించారు. గణపసముద్రం చెరువు కాలువల మరమ్మతుకు నిధులు కావాలని స్థానిక నాయకులు, రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా రూ.32 లక్షలను మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు నారగాని దేవేందర్ గౌడ్, పోట్ల నగేష్, ఎంపీటీసీలు మోటపోతుల శివశంకర్ గౌడ్, మారగాని సరస్వతి శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రరెడ్డి, ఉప సర్పంచ్ పోతర్ల అశోక్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొలసాని లక్ష్మీ నర్సింగరావు, టౌన్ ప్రెసిడెంట్ గుర్రం తిరుపతి గౌడ్, మాజీ సర్పంచ్ కట్ల ప్రశాంతి శంకరయ్య, మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ గౌడ్, నాయకులు కసిరెడ్డి వెంకటరమణారెడ్డి, రేగూరి లక్ష్మారెడ్డి, జూనూతుల రవీందర్ రెడ్డి, పోతర్ల మల్లికార్జున్, కరుణాకర్ రెడ్డి, బోయిని సాంబయ్య ముదిరాజ్, బొట్ల స్వామి, యూత్ నాయకులు హఫీజ్, సల్వాది సురేష్, దివి వంశీ, దూడపాక శ్రీనివాస్, ఐబీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments