స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ఆదివారం ఆత్మీయత సేవా సొసైటీ ఆధ్వర్యంలో, దాతల సహకారంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించి చిన్నారులకు మజ్జిగ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిలో ప్రజల దాహాన్ని తీర్చేందుకు ఆత్మీయత సేవా సొసైటీ వారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, పీఎసీఎస్ చైర్మన్ మేకల సంపత్ యాదవ్, సీనియర్ నాయకులు సెగ్గం సిద్ధూ, పైడిపల్లి రమేష్, క్యాతరాజు సాంబమూర్తి, యూత్ నాయకులు, ఆత్మీయతసేవా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మహేందర్, సభ్యులు పాల్గొన్నారు.
చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం: ఎమ్మెల్యే గండ్ర
RELATED ARTICLES
Recent Comments