Sunday, November 17, 2024
Homeజిల్లా వార్తలురైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 

రూ.178.66 లక్షలతో ఊర చెరువు మరమ్మత్తు పనులు పూర్తి 

స్పాట్ వాయిస్, గణపురం: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం మండలంలోని ధర్మరావుపేట శివారు ఊర చెరువు గుండ్ల మరమత్తు పనులు పూర్తి కాగా బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్ఆర్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ఊర చెరువుకు పలుచోట్ల గండ్లు పడి నీరు పూర్తిస్థాయిలో బయటకు వెళ్లిందని, చెరువు ఆయకట్టు పరిధిలో నాట్లు వేసుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో ప్రభుత్వం స్పందించి రూ.178.66 లక్షలతో మరమ్మతు పనులు ప్రారంభించగా ప్రస్తుతం అవి పూర్తయ్యాయని, ఈ వ్యవసాయ సీజన్ లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంటలు సాగు చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐబీ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈఈ బసవ ప్రసాద్ గౌడ్, ఏఈఈలు మహేందర్, రామారావు, కాంట్రాక్టర్ సమ్మిరెడ్డి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments