ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
స్పాట్ వాయిస్, నర్సంపేట: రెండు రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రజలకు సూచించారు. నెక్కొండ మండలంలోని వెంకటాపూర్ గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు వరద ప్రవాహంలో చిక్కుకుంది. అందులో సుమారు 45 మంది ప్రయణికులు ఉన్నట్టు తెలియడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే ప్రయాణికులను లారీ సహాయంతో సురక్షిత ప్రదేశానికి తరలించారు. అనంతరం వారికి భోజన ఏర్పాటు కల్పించి ఒక పాఠశాలలో వారికి వసతిని ఏర్పాటు చేశారు. అనంతరం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్య శారద, కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తో సమావేశమై పరిస్థితి ని సమీక్షించారు.
లోతట్టు ప్రాంతాలను పరిశీలన
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను ఆదివారం పరిశీలించారు. నర్సంపేట పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ ను సందర్శించి వరద తీవ్రతను పరిశీలించారు. అధికారులు వరద తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, వరద ముప్పు పొంచి ఉన్నట్లయితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ నగర ప్రజలతో మాట్లాడారు. వారు సూచించిన విధంగా అన్ని సౌకర్యాలను కల్పిస్తామని,కాలనీవాసులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసనిచ్చారు. ఎన్టీఆర్ నగర్ కు సీసీ రోడ్డు సౌకర్యం త్వరలోనే కల్పిస్తామని, కాలువలు, కల్వర్టులు వెడల్పు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట నర్సంపేట ఆర్డిఓ,ఎమ్మార్వో,మార్కెట్ కమిటీ చైర్మన్,పాలాయి శ్రీనివాస్,పాలాయి రవి,దండెం రతన్ కుమార్,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Recent Comments