అభినవ అంబేద్కర్ సీఎం కేసీఆర్
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన దళితబంధు లబ్ధిదారుల అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కూలీలుగా పనిచేసిన దళితులు ఓనర్లుగా మారి వారి జీవితల్లో సంతోషాలు నింపాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయం అన్నారు. దళిత బంధు పథకంలో ఎంపికైన వారు ఇతరులకు ఆదర్శంగా నిలువాలని చెప్పారు. ఈ పథకంలో ఏ యూనిట్ పెట్టుకుంటే తమ జీవితాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయో మార్గదర్శకాలు చేసుకోవాలని సూచనలు చేశారు. ఒకే గ్రామంలో లేనటువంటి కొత్త ఆలోచనలతో వ్యాపారం పెట్టుకోవాలని కోరారు. అప్పట్లో బర్రెలను కొనుకుంటే గ్రామాల్లో హేళనగా చూసేవాళ్లు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బర్రెలను కొనుకొని పాల వ్యాపారం చేసే వారే అధికంగా సంపాదిస్తున్నారని తెలిపారు. దళితబంధు పథకాన్ని దశల వారీగా అందజేస్తామని తెలిపారు. దళితల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపే మరో అభినవ అంబేద్కర్ సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, యువ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
దళితులు అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం
RELATED ARTICLES
Recent Comments