Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలుఅన్ని మతాలకు సమ ప్రాధాన్యత....

అన్ని మతాలకు సమ ప్రాధాన్యత….

మత సామరస్యానికి ప్రతీక టీఆర్ఎస్ పాలన..
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
స్పాట్ వాయిస్, దామెర: టీఆర్ఎస్ సర్కార్ అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తోందని పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా గురువారం రాత్రి దామెర, ఆత్మకూరు మండలాల్లోని 400 నిరుపేద ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం అందజేసే కానుకలను ఎమ్మెల్యే పంపినీ చేశారు. అనంతరం చల్లా మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాల పండుగలను పురస్కరించుకుని పేద ప్రజానీకానికి ప్రభుత్వ కానుక అందించడం జరుగుతుందని అన్నారు. అన్ని వర్గాలకు ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని మత సామరస్యానికి ప్రతీకగా నిలిపే లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. పండుగలు అనేవి సంతోషంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకునేవన్నారు. అయితే పండుగల వేళ నిరుపేద లు నూతన వస్త్రాలు తెచ్చుకునే పరిస్థితి లేకపోవడాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయా వర్గాల ప్రజలకు పండగ వేళ బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ రంజాన్ పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. అనంతరం నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు,  మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments