Saturday, April 19, 2025
Homeజిల్లా వార్తలుకార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు

కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు

కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు..

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

స్పాట్ వాయిస్, పరకాల: కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను సర్కారు కృషి చేస్తోందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల మున్సిపాలిటీ 14వ వార్డు పరిధిలోని వెలుమవాడ ప్రాథమిక పాఠశాలలో మన పట్టణం – మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.30.00 లక్షలతో పాఠశాల మరమ్మతుల పనులకు ఆదివారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన పథకం మన ఊరు-మన బడి అన్నారు. పాఠశాలలకు నీటి సౌకర్యంతో పాటు టాయిలెట్లు, విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరిపడే ఫర్నీచర్ అందించడం, మరమ్మత్తులు చేయడం, కిచెన్లు ఏర్పాటు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త తరగతి గదులు నిర్మాణం చేయడం, డిజిటల్ విద్య వంటి వాటిని అమలు చేయనుందన్నారు. విద్య,వైద్య బాగుంటే రాష్ట్రం బాగుంటుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు , తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments