Thursday, April 17, 2025
Homeజిల్లా వార్తలురాముడి కృపతో కొవిడ్ అంతం..

రాముడి కృపతో కొవిడ్ అంతం..

అంగరంగ వైభవంగా సీతారామ కల్యాణం

స్పాట్ వాయిస్, శాయంపేట: హన్మకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం ప్రగతి సింగారంలో సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో సీతారాముల కల్యాణ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి – జ్యోతి దంపతులు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెండేళ్లపాటు కరోనా మహమ్మారి వల్ల స్వామి వారి కళ్యాణం నిరాడంబరంగా నిర్వహించామన్నారు. ఈ సంవత్సరం స్వామి వారి కృపతో మహమ్మారి అంతమైందని, ఈ నేపథ్యంలో ఆలయ ఆరుబయట ఏర్పాటు చేసిన మంటపంలో భక్తుల సమక్షంలో కళ్యాణ క్రతువు జరిపినట్లు పేర్కొన్నారు. స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగంతుడిని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలో చల్లా రఘుపతి రెడ్డి, ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, సర్పంచ్ పోతు సుమలత రమణారెడ్డి, ఉప సర్పంచ్ మోరె పద్మ శ్రీను, గోగుల జైపాల్ రెడ్డి, కర్ర ఆదిరెడ్డి, బోయినపల్లి రఘుపతి రెడ్డి, కర్ర రాజిరెడ్డి, దొడ్డిపాక సమ్మయ్య, మాదిరెడ్డి బుచ్చిరెడ్డి, పెద్దిరెడ్డి లింగారెడ్డి, చిలుకల పైడి, దైనంపల్లి రఘు, బత్తిని కుమార్, పరుపాటి శ్రీపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments