మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
స్పాట్ వాయిస్, దామెర : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం దామెర మండలం పసరగొండ గ్రామంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రూ.20 లక్షలతో చేపట్టిన మహిళా భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ప్రతి గ్రామంలో మహిళ భవనాన్ని నిర్మించుకోవాలని, నియోజకవర్గంలోనే మహిళల కోసం ఇప్పటికే 37 గ్రామాల్లో మహిళా భవనాలకు నిధులు కేటాయించామని తెలిపారు. అందులో కొన్ని భవనాలు పూర్తి కాగా, మరికొన్ని నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. పసరగొండ గ్రామాభివృద్ధి కోసం రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు, అలాగే గ్రామానికి మొదటి విడతగా 25 డబుల్ బెడ్ రూమ్ లు మంజూరు చేస్తానని చల్లా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ కాగితాల శంకర్, జెడ్పీటీసీ గరిగే కల్పన- కృష్ణమూర్తి, వైస్ ఎంపీపీ జాకీర్ ఆలీ, పీఏసీఎస్ చైర్మన్ బొల్లు రాజు, ఎంపీడీవో వెంకటేశ్వర రావు, ఏపీఎం ఝాన్సీ, టీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు గండు రామకృష్ణ, స్థానిక సర్పంచ్ సాంబయ్య, ఎంపీటీసీ కళా సుధాకర్, పోలం కృపాకర్ రెడ్డి, కమలాకర్, జన్ను మల్లయ్య, మోహన్, మహిళా సంఘాల సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
RELATED ARTICLES
Recent Comments