కాకతీయ మెగావస్త్ర పరిశ్రమను సందర్శించిన ఎమ్మెల్యే చల్లా..
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: పరకాల
నియోజకవర్గంలోని గీసుగొండ, సంగెం మండలాల శివారులోని కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో సోమవారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా వస్త్ర పరిశ్రమలో నూతనంగా నిర్మాణం చేస్తున్న కైటెక్స్ కంపెనీ, వాటర్ పైప్ లైన్, వాటర్ టాన్క్ నిర్మాణ పనులను, 220 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.
అనంతరం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కైటెక్స్ కంపెనీ నిర్మాణ పనులు, పార్క్ ఏరియాలో జరుగుతున్న వాటర్ ట్యాన్క్,పైప్ లైన్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.ఫిబ్రవరి 2023లోగా కైటెక్స్ కంపెనీ నిర్మాణ పనులు పూర్తవుతాయని అయ్యారు. అదేవిధంగా త్వరలోనే యంగ్ వన్ కంపెనీ నిర్మాణ పనులు కూడా ప్రారంభం కానున్నాయని తెలిపారు.పరిశ్రమ పనుల నిర్వహణ కొనసాగేలా ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలని ఆయా శాఖల అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.అనంతరం టెక్స్ట్ టైల్ పార్క్ ఏర్పాటు కోసం భూ సేకరణలో భూములు కోల్పోయిన రైతులకు కేటాయించిన స్థలంలో ఏర్పాటుచేస్తున్న లేఅవుట్ ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సంగెం, గీసుగొండ మండలాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయ కులు, కార్యకర్తలు, కైటెక్స్ కంపెనీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Recent Comments