స్పాట్ వాయిస్ , నర్సంపేట : మంత్రి హరీష్ రావు పై వైఎస్సార్ సీపీ జనరల్ సెక్రెటరీ సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ ఐటీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం అయన మాట్లాడారు. టీచర్ యూనియన్ సమావేశంలో మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. మంత్రి హరీష్ రావు చెప్పింది ముమ్మాటికి నిజమని అందులో ఎలాంటి అవాస్తవాలు లేవన్నారు. తెలంగాణ ప్రభుత్వం 73% ఫిట్మెంట్ ఇస్తే, పక్క రాష్ట్రంలో 66% మించి ఇవ్వలేదన్నారు. కేంద్రం విధించిన షరతులకు తలొగ్గి మీటర్లు పెట్టి 7వేల కోట్లు తీసుకున్నప్పటికీ ఫిట్మెంట్ ఇవ్వలేక పోయారని అని మంత్రి చెప్పారని ఇది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం తెలంగాణ పథకాలపైన ప్రాజెక్టుల పైన అనేకసార్లు కంప్లైంట్ చేసిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచే విధంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారని సజ్జల అనడం సరికాదన్నారు. మంత్రి హరీష్ రావు ఇతర రాష్ట్రాల వారిపై గాని, ప్రభుత్వ ఉద్యోగులపై గాని ఏనాడు తప్పుడు వ్యాఖ్యలు చేయలేదన్నారు.
Recent Comments