ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించిన ఎమ్మెల్యే
స్పాట్ వాయిస్, నల్లబెల్లి: 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నల్లబెల్లి మండలం మేడపల్లి-రాంపూర్ గ్రామాల్లో అధికారుల పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గృహ వ్యర్థాలైన తడి,పొడిచెత్త సేకరణ, డంప్ యార్డు నిర్వహణలో సేకరించిన వ్యర్థాలతో సేంద్రీయ ఎరువుల తయారీ, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామస్తులకు వివరించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు. హరితహారంలో నాటిన మొక్కలన్నీ వందశాతం బతికేలా ట్రీ-గార్డులను ఏర్పాటు చేసి రక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ సునీత ప్రవీణ్ గౌడ్, ఎంపీడీఓ విజయ్ కుమార్, ఎంపీఓ కూచన ప్రకాష్, రాంపూర్ సర్పంచ్ సురేష్, మేడిపల్లి సర్పంచ్ లావుడ్య తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
Recent Comments