Saturday, January 25, 2025
Homeజిల్లా వార్తలుఎమ్మెల్యేను మా ఊరికి రానివ్వం..

ఎమ్మెల్యేను మా ఊరికి రానివ్వం..

రాజయ్య మా గ్రామాన్ని పట్టించుకోలేదని ఆగ్రహం..
మంగళబండ తండా వాసులు నిరసన..
పర్యటన వాయిదా వేసుకున్న తాటికొండ..
స్పాట్ వాయిస్, జనగామ : గ్రామాభివృద్ధిని పట్టించుకోని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యను తమ గ్రామానికి రానివ్వబోమని శనివారం మంగళబండ తండా గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ మేరకు స్థానిక అధికార పార్టీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. రాష్ట్ర దశాబ్ది అవతరణ దినోత్సవాలను పురస్కరించుకుని జనగామ జిల్లా రఘునాథ పల్లి మండలం మంగళబండ తండా లో సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య వస్తున్నారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు సభా వేదిక వద్దకు చేరుకున్నారు. అధికార పార్టీలో ఉన్న రాజయ్య ఎమ్మెల్యే అయినప్పటి నుంచి గ్రామ సమస్యలు, అభివృద్దిని ఏనాడు పట్టించుకోని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న అధికార పార్టీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో రాజయ్యను గ్రామంలోకి రానిచ్చేది లేదని అక్కడే నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే రాజయ్య మంగళబండ తండా పర్యటను వాయిదా వేసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments