ఇద్దరు మిర్చి రైతుల బలవన్మరణం..
పురుగుల మందు తాగి ఆత్మహత్య
స్పాట్ వాయిస్, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు మిర్చి రైతులు బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా పరకాల మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన పసుల మొగిలి, మహబూబాబాద్ జిల్లా కురవి మండలం హుమ్లాతండాకు చెందిన బానోత్ బాలకిషన్ మిర్చి పంట వేసారు. అయితే సరైన దిగుబడి రాక.. పంట కోసం తెచ్చిన అప్పు తీర్చలేక ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు అన్నదాతల ఆత్మహత్యలతో ఉమ్మడి జిల్లాలో విషాదం నెలకొంది..
Recent Comments