స్పాట్ వాయిస్, మానుకోట: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తల్లి గుగులోతు దస్మి (86) కన్నుమూశారు. పది రోజుల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను హైదరాబాద్లోని యశోద దవాఖానలో చేర్పించారు. కాగా, చికిత్స పొందుతూ శుక్రవారం గుండె పోటుతో దస్మి మృతి చెందారు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు సత్యవతిరాథోడ్ ను పరామర్శించి సంతాపం తెలిపారు.
Recent Comments