స్థానికo పై మంత్రి పొంగులేటి క్లారిటీ..
నెలాఖరులోగా షెడ్యూల్..
వారం లో రైతు భరోసా
కాంగ్రెస్ శ్రేణులు రెడీ కండి..
స్పాట్ వాయిస్, బ్యూరో: జూన్ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం కేబినెట్‌లో చర్చించి ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయన్నారు. అనంతరం తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయన్నారు. స్థానిక ఎన్నికలకు 15రోజుల గడువు మాత్రమే ఉందన్న ఆయన కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు. గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. వారం రోజుల్లోనే రైతు భరోసా, సన్నాలకు బోనస్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు.
Recent Comments