మంత్రి హరీశ్ రావు బట్టలూడదీస్తా..
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
బీఆర్ఎస్ మరో చోట టికెట్ లొల్లి
స్పాట్ వాయిస్, బ్యూరో: ఎన్నికల వేళా.. బీఆర్ఎస్ లో డైలాగులు పేలుతున్నాయి. అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తాజాగా మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఫైర్ అయ్యారు. హరీష్ రావు గతం గుర్తించుకోవాలని సూచించారు. ఆయన నియోజకవర్గాన్ని వదిలి తమ జిల్లాలో పెత్తనం చేస్తున్నాడని మండిపడ్డారు. తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన మైనంపల్లి టికెట్ అంశంపై సోమవారం మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు బట్టలు ఊడదీసే వరకు నిద్రపోనన్నారు. ఆయన ఓటమి చూస్తానని తిరుమలలో శపథం చేశారు. అక్రమంగా రూ. లక్ష కోట్లు సంపాదించాడని మైనంపల్లి ఆరోపించారు. సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తానన్నారు. రాజకీయంగా ఎంతో మందిని అణిచివేశాడన్నారు. మెదక్లో తన తనయుడు.. మల్కాజ్గిరిలో తాను పోటీ చేస్తామని మైనంపల్లి తెలిపారు. మెదక్లో తన తనయుడుని కచ్చితంగా గెలిపించుకుంటానన్నారు. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని.. తనకు పార్టీ ఇప్పటికే టికెట్ ప్రకటించిందన్నారు. మెదక్ నా కొడుక్కి, మల్కాజిగిరి నాకు ఇస్తేనే బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తానని, లేదంటే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలుస్తామని హెచ్చరించారు. హరీశ్ రావు ఎలా వచ్చారో తన కొడుకుని సైతం అలానే పంపిస్తానని, మెదక్ ఎమ్మెల్యేగా తన కొడుకును చూడడమే నా లక్ష్యమన్నారు. మంత్రి హరీశ్ రావు సిద్ధిపేటలా.. మెదక్ ను ఎందుకు అభివృద్ధి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన నియంతలా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Recent Comments