Friday, November 22, 2024
Homeతెలంగాణ40 ఏళ్లలో గిట్లాంటి సీఎంను చూడలే..: మంత్రి ఎర్రబెల్లి

40 ఏళ్లలో గిట్లాంటి సీఎంను చూడలే..: మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ‌లోనే రోడ్లకు మ‌హ‌ర్దశ‌
అద్దంలా మెరుస్తున్న రహదారులు
అన్ని గ్రామాలకు రోడ్లు
సీఎం కేసీఆర్ చొర‌వ‌తో జ‌రుగుతున్న అభివృద్ధి
3 రోడ్లకు శంకుస్థాప‌న చేసిన మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు
స్పాట్ వాయిస్, మహబూబాబాద్: ప్రత్యేక రాష్ట్రం వ‌చ్చిన త‌ర్వాతే రోడ్లకు మ‌హ‌ర్దశ వ‌చ్చింద‌ని, ఇప్పుడు ప్రతీ ప‌ల్లెకు రోడ్లు రావ‌డ‌మే కాకుండా అంతర్గత రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయని, ఇది సీఎం కేసీఆర్ చొరవేనని మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. నెల్లికుదురు మండ‌లం సీతారాంపురం వ‌ద్ద మంత్రి మూడు రోడ్లకు శంకుస్థాప‌న చేశారు. సీతారాం పురం నుంచి ఇనుగుర్తి వ‌ర‌కు వ‌యా రేకుల తండా వ‌ర‌కు రూ. 3 కోట్లతో వేయ‌నున్న 5 కి.మీ. బీటీ రోడ్డు, సీతారాం పురం నుంచి రాజుల కొత్తప‌ల్లి వ‌ర‌కు రూ. కోటి 55 ల‌క్షలతో వేయ‌నున్న రెండున్నర కి.మీ. బీ.టీ రోడ్డుకు, సీతారాంపురం నుంచి చిన్న నాగారం వ‌ర‌కు రూ. 1.80 ల‌క్షలతో వేయ‌నున్న 3 కి.మీ. బీటీ రోడ్డుకు మంత్రి మ‌హ‌బూబాబాద్ ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్‌, మున్సిప‌ల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహ‌న్ రెడ్డి, క‌లెక్టర్ శ‌శాంకతో క‌లిసి మంగళవారం శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. గ‌తంలో రోడ్లు గ‌తుకుల మ‌యంగా ఉండేవ‌న్నారు. మ‌ట్టి కొట్టుకుపోయి, కంక‌ర తేలి, న‌డ‌వ‌డానికి కూడా వీలు కాకుండా ఉండేవని చెప్పారు. గ్రామాల‌కు లింకు రోడ్లు కూడా ఉండేవి కావని, ఇక గ్రామాల్లో అంత‌ర్గత రోడ్ల ప‌రిస్థితి అయోమ‌యంగా ఉండేది. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత ఇప్పుడు రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయ‌ని చెప్పారు. 40 ఏండ్ల త‌న రాజ‌కీయ జీవితంలోనూ ఇలాంటి సీఎంను, అభివృద్ధిని చూడ‌లేద‌ని మంత్రి అన్నారు. ఒక‌వైపు ఇంత‌గా అభివృద్ధి జ‌రుగుతుంటే, కొంద‌రి కండ్లకు ఇదంతా క‌నిపించ‌డం లేద‌ంటూ ప్రతిపక్షలపై మండిపడ్డారు. కేంద్రం రైతుల‌పై న‌ల్ల చ‌ట్టాలు తెచ్చి కార్పొరేట్లకు మ‌ద్దతుగా రైతుల‌ను రాచి రంపాన పెడుతున్నద‌న్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజ‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments