ఎంజీఎం లో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు నర్సుల సస్పెన్షన్..
విధుల్లో నిర్లక్ష్యం.. వేటు వేసిన సూపరింటెండెంట్
స్పాట్ వాయిస్, వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేస్తూ.. సూపరింటెండెంట్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ విధుల నుంచి తప్పించారు. ఒక్కసారి గా ఎంజీఎం లో ఐదుగురిపై వేటు పడడం సంచలనం గా మారింది.
*సస్పెండ్ అయినవ వైద్యులు..*
1) రిథేష్ (సివిల్ అసిస్టెంట్ సర్జన్)
2) కే. రాజేశ్ ( అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ సర్జన్)
*స్టాఫ్ నర్సులు*
1) యాక లక్ష్మీ
2) ఎం.జ్యోతి
3) కే. సుజాత
Recent Comments