ఆస్పత్రిలో కి ఎలుకలు రాకుండా ఏర్పాట్లు…
స్పాట్ వాయిస్, ఎంజీఎం: ఎంజీఎంలో కొత్త సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. నాలుగు రోజుల కిందట ఆర్ఐసీయూ పేషెంట్ ను ఎలుక కరవడాన్ని ప్రభుత్వం సీరియస్ తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటికప్పుడు ఘటన కు బాధ్యులుగా పేర్కొంటూ అప్పటి సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావు ను విధుల నుంచి తప్పించి, డాక్టర్ చంద్ర శేఖర్ కు బాధ్యతలు అప్పగించింది. అస్తవ్యస్త మైన పారిశుధ్య నిర్వహణ పై ఏజిల్ సంస్థ ను కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టగా ప్రస్తుతం హాస్పిటల్ పారిశుధ్యం పై సూపరింటెండెంట్ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే సోమవారం దవాఖాన పరిసరాల్లో డ్రైనేజీ వ్యవస్థ ను బాగుచేసే పనులకు శ్రీకారం చుట్టారు. డ్రైనేజీకి సంబంధించిన పైప్ లైన్ పనులను సిబ్బంది తో సరి చేయించారు. వంట గది, భోజన శాల చుట్టు ఉన్న పనులను పూర్తి చేయించారు.
ఎంజీఎంలో ఎలుకలపై ఫోకస్
RELATED ARTICLES
Recent Comments