రేడియాలజీ విభాగంలో దర్శనం..
స్పాట్ వాయిస్, వరంగల్: ఎంజీఎంలో మళ్లీ పాము కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం రేడియాలజీ విభాగం(రూమ్ నంబర్ 92) లో పాము కనిపించడంతో రోగులు, సిబ్బంది పరుగులు తీశారు. ఉదయం ఓపీ సేవలు కొనసాగే సమయం కావడంతో రేడియాలజీ విభాగంలో రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఇదే సమయంలోనే పాము కనిపించడంతో కొంత సేపటి వరకు రోగులు, సిబ్బంది లోపలికి వెళ్లేందుకు భయపడ్డారు.
సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది పాముని పట్టుకొని, నిర్జన ప్రదేశానికి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఎంజీఎంలో పాము..
RELATED ARTICLES
Recent Comments