Wednesday, December 4, 2024
Homeతెలంగాణకిష్టయ్య చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి

కిష్టయ్య చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి

– పోలీస్ కిష్టయ్యకు మెపా ఆధ్వర్యంలో ఘన నివాళి
– ముఖ్య అతిధిగా పాల్గొన్న మెపా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్
స్పాట్ వాయిస్, హన్మకొండ: తెలంగాణ అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని మెపా ( ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పోలీస్ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా హనుమకొండలోని రాష్ట్ర కార్యాలయంలో కృష్ణయ్య ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ చరిత్రలో పోలీస్ కిష్టయ్య వీరమరణం మరపురాని ఘట్టమన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడిగా చరిత్రలో నిలిచిపోయిన గొప్ప వ్యక్తి పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ అని కొనియాడారు. డిసెంబర్ ఒకటి 2009న తుపాకీతో కాల్చుకొని వీరమరణం పొందిన కానిస్టేబుల్ కృష్ణయ్య తన రక్తంతో ఉద్యమానికి కొత్త దిశ చూపించాడని అన్నారు. పోలీస్ కృష్టయ్య ముదిరాజ్ గురించి భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మలి దశ ఉద్యమంలో అమరులైన 1200 మంది లో ఒక్కడిగా కాకుండా పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ కు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. అనంతరం మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్ మాట్లాడుతూ.. తెలంగాణ మలిదశ ఉద్యమానికి తన మరణంతో బలాన్ని ఇచ్చిన పోరాట యోధుడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ అని కొనియాడారు. కిష్టయ్య వర్ధంతి జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ట్యాంక్ బండ్ పై పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ కృష్ణయ్యకు నివాళులర్పించిన వారిలో మెపా వ్యవస్థాపక సభ్యులు బోనాల రమేష్ ముదిరాజ్, రాష్ట్ర ఉపాద్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్,మెపా రాష్ట్ర కార్యదర్శులు సింగారపు రామకృష్ణ ముదిరాజ్,నీరటి రాజు ముదిరాజ్,తాళ్ళ రవీందర్,హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శులు అమ్మగారి శ్యామ్ ముదిరాజ్,నాయకులు ఈరబోయిన వినోద్,కట్ల విజయ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments