మెపా జనగామ జిల్లా కార్యాలయం ప్రారంభం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ కు సన్మానం
స్పాట్ వాయిస్, జనగామ: ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (మెపా) తెలంగాణ యూనియన్ జనగామ జిల్లా కార్యాలయాన్ని జనగామ గీతానగర్ (జిల్లా కోర్డు ఏరియా)లో ఏర్పాటు చేశామని మెపా జిల్లా అధ్యక్షుడు నీల అరుణ్ కుమార్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన రాజు కుమార్ ముదిరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ కి ఘన సన్మానం చేశారు. అనంతరం దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్ట మొదటి కార్యాలయం జనగామ జిల్లాలో ఏర్పాటు చేసి, అన్ని జిల్లాలకి ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యాలయం జిల్లాలోని మెపా సభ్యులు కలిసి కట్టుగా ఉండేందుకు కేంద్ర బింధువుగా ఉంటుందని, ముదిరాజ్ ల సమస్యల పరిష్కారమే కేంద్రంగా ఉంటుందన్నారు. మెపా ఎజెండాలో ముఖ్యమైన విద్య, ఉద్యోగం, సాధికారత సాధన దిశగా అడుగులు వేయడానికి నిదర్శనమే ఈ కార్యాలయమన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నీల నరేష్ బాబు, జీడి హరీష్, ఎళ్లస్వామి, మంత్ర రతనం, చందర్, పిట్టల కరుణాకర్, నీల విజయ్ కుమార్, దూసరి భాస్కర్, నీల అశోక్, జీడి శివాజీ, గడ్డల రాకేష్, వినోద్, గూడేముల్ల నవీన్, రంజిత్ ముదిరాజ్, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
మెపా జనగామ జిల్లా కార్యాలయం ప్రారంభం
RELATED ARTICLES
Recent Comments