Sunday, September 22, 2024
Homeటాప్ స్టోరీస్మెగా వర్సెస్ అల్లు

మెగా వర్సెస్ అల్లు

మళ్లీ రచ్చ..!
హీరోలు అడవులను కాపాడేవారు..
ఇప్పుడు నరికేసి, స్మగ్లింగ్ చేస్తున్నారు..
పుష్ప పాత్రపై పవన్ కళ్యాణ్..?
డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలతో చర్చలు
ఎన్నికల నాటి నుంచి విభేదాలంటూ కామెంట్స్..
స్పాట్ వాయిస్, బ్యూరో: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. మెగా-అల్లు ఫ్యామీలి మధ్య వార్ అంటూ ట్రెండ్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బెంగ‌ళూరు ప‌ర్యట‌న‌లో ఉన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్ణాటక అటవీ శాఖ మంత్రితో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి ముందు జ‌రిగిన ప్రెస్ మీట్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రస్తుతం వ‌స్తున్న సినిమాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పుడు అడవుల్ని రక్షించే పాత్రల్లో హీరోలు నటించేవారు.. ఇప్పుడు అడవుల్ని నరికేసి, స్మగ్లింగ్ చేసే పాత్రల్లో నటిస్తున్నారు.. అదే హీరోయిజం అయిపోయిందంటూ పేర్కొన్నారు. నేను ఆ ప‌రిశ్రమ‌లో ఉన్నాన‌ని అప్పుడ‌ప్పుడు బాధ‌గా అనిపిస్తుంటుంది. ఇలాంటివి త‌గ్గి మ‌ళ్లీ అడవుల ప్రాముఖ్యత తెలిసేలా సినిమాలు రావాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పారు. దీంతో మళ్లీ చర్చలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ కావాలనే ఇలా అన్నారని, ఉద్దేశపూర్వకంగానే బన్నీ మీద, పుష్ప చిత్రం మీద కౌంటర్లు వేశారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అల్లు అర్జున్ న‌టిస్తున్న పుష్ప సినిమాలో గొడ్డళ్లు పట్టుకొని, స్మగ్లింగ్ చేయడం అడ‌వుల‌ను న‌రికివేయడం లాంటివి ఉండ‌డంతో కావాల‌ని అలా మాట్లాడడంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారం నుంచి..
మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ ఇష్యూ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల గురించి తెలిసిందే. ఏపీ ఎన్నికల ప్రచారంలో నంద్యాల ఎపిసోడ్ తరువాత ఈ రెండు కుటుంబాల మధ్య సమీకరణాలు మారిపోయాయనే టాక్ వినిపిస్తోంది. గతంలో సాయి ధరమ్ తేజ్ అన్ ఫాలో అవ్వడం, నిహారిక రియాక్ట్ అవ్వడం, నాగబాబు ఇన్ డైరెక్ట్ సెటైర్లు ఇలా అన్నీ కూడా బేరీజు వేసుకుని మెగా వర్సెస్ అల్లుని నెట్టింట్లో బాగానే ట్రెండ్ చేస్తున్నారు. నిహారిక సైతం తన ఈవెంట్లు, తన మాటల్లో అల్లు అనే పదాన్ని రానివ్వడం లేదు. మొన్న కమిటీ కుర్రోళ్లు ఈవెంట్‌లో మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీ గురించి చెప్పింది.. కానీ బన్నీకి నేషనల్ అవార్డు వచ్చిందని మాత్రం చెప్పలేదు. దీంతో బన్నీని మెగా ఫ్యామిలీ దూరం పెట్టిందని, రెండు కుటుంబాల మధ్య దూరం మరింతగా పెరిగిందంటూ కామెంట్లు వినిపిస్తుంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన పరోక్ష కామెంట్లు, వేసిన సెటైర్లు చూస్తుంటే అది బన్నీ, పుష్ప చిత్రాలను టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments