Sunday, September 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన
200 మందికి పరీక్షలు చేసిన డాక్టర్ నరేశ్ సముద్రాల, ఎస్.సాయి చరణ్ 
స్పాట్ వాయిస్, హన్మకొండ : ఎన్ పీ అంజలి పాలి క్లినిక్, డే కేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండ ఇందిరానగర్, రాయపుర వద్ద నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది. కార్యక్రమానికి 9వ డివిజన్ కార్పొరేటర్ చీకటి శారదఆనంద్, 8వ డివిజన్ కార్పొరేటర్ బైరి లక్ష్మి, బీజేపీ రాష్ట్ర నాయకుడు బైరి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందన్నారు. వైద్య శిబిరానికి వచ్చిన వారికి ఉచితంగా పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కాగా, డాక్టర్ నరేశ్ సముద్రాల, ఎస్.సాయి చరణ్ (దంతవైద్యులు), డాక్టర్ త్రివేణి సుమారు 200 రోగులకు వివిధ పరీక్షలు చేసి, ఉచితంగా మందులు అందజేశారు. ప్రతి గురువారం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఉచితంగా బీపీ, షుగర్ టెస్టులు చేయనున్నామని, పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇన్ చార్జి డాక్టర్లు డాక్టర్ వినయ్, నిర్వాహకులు అలువాల భాస్కర్, శీలం రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments