అరెస్ట్ చేసిన పోలీసులు..
స్పాట్ వాయిస్ నర్సంపేట(ఖానాపూర్): సోషల్ మీడియాలో తన ఫొటోను పోలీస్ ఆఫీసర్ గా పెట్టుకుని మహిళలను వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఖానాపూర్ మండలం కొడితిమట్ తండాకు చెందిన జాటోతు మహేష్ అనే దివ్యాంగుడు వాట్సప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, ఫేస్ బుక్ అకౌంట్లకు చనిపోయిన ఎస్సై శ్రీనివాస్ ఫొటోని ప్రొఫైల్ ఫొటోగా పెట్టుకున్నాడు. తన పేరు దేవేందర్ అని తాను కరీంనగర్ 2 వ పట్టణ ఎస్సైగా పనిచేస్తున్నానని 6 గురి కి పైగా యువతులతో అసభ్యకరంగా చాటింగ్ చేశాడు. నేను ఎస్సైగా వివిధ జిల్లాలో పని చేశాను. నన్ను మీరు ప్రేమించాలంటూ వేధింపులకు గురి చేస్తున్నాడు. అతని వేధింపులకు తాళలేక ఓ యువతి పోలీస్ లను ఆశ్రయించడంతో అతని బండారం బయట పడింది. ఇతని గురించి మరింత లోతుగా విచారణ చేయగా ఇతడు పోలీస్ లకు వందలాది ఫేక్ డయల్ 100 కాల్స్ చేసి పోలీసుల సమయం వృథా చేస్తూ తప్పుడు సమాచారం ఇచ్చేవాడని తేలిందన్నారు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా ఇతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
Recent Comments