మేడారంలో అర్ధరాత్రి ఆగమాగం
సీతక్క డౌన్ డౌన్ అంటూ నినాదాలు
స్పాట్ వాయిస్, మేడారం: మేడారంలోని స్థానిక చిరు వ్యాపారులపై అధికారులు దౌర్జన్యం చేసారు. జేసీబీలతో షాప్ లను కూలగొట్టడoతో మేడారం గ్రామ చిరు వ్యాపారులు అదనపు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకొని నిరసన వ్యక్తం చేసారు. మంత్రి సీతక్క డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనలకు దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ఎస్పీ ఘటన స్థలానికి చేరుకొని చిరు వ్యాపారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిo చారు.
Recent Comments