Saturday, May 24, 2025
Homeతెలంగాణఇసుకేస్తే రాలనంతగా..

ఇసుకేస్తే రాలనంతగా..

మేడారం జనసందోహం..
భారీగా తరలివచ్చిన భక్తులు..
23న రానున్న సీఎం, గవర్నర్
స్పాట్ వాయిస్, మేడారం: మేడారం జాతర కోలాహలంగా సాగుతోంది. మంగళవారం సాయంత్రం నుంచే భక్తులు భారీగా చేరుకోగా.. బుధవారం ఉదయం నాటికి పూర్తిగా జనసందోహంగా మారింది. భారీ సంఖ్యలో భక్తులు గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగే వేడుకలో సాయంత్రం డప్పు వాద్యాలు, సంప్రదాయ నృత్యాల మధ్య సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరనున్నారు. భక్తులు జంపన్న వాగులో స్నానాలాచరించి వన దేవతలకు నిలువెత్తు బంగారం, పసుపు, కుంకుమ సమర్పిస్తున్నారు. శివసత్తులు, ఓడిబియ్యం, చీరే సారెలతో తల్లుల ముందు ప్రణమిల్లుతున్నారు. మేడారం జాతర కోసం దేవాదాయ, పోలీసు, రెవెన్యూ, పంచాయతీ రాజ్‌ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నారు. అమ్మవారి గద్దెల వద్ద రెవెన్యూ, ఎండోమెంట్, పోలీస్, ఫైర్, సింగరేణి రెస్క్యూ, ట్రాన్స్ కో, పంచాయతీ రాజ్ అధికారులు మూడు షిప్టుల్లో పనిచేస్తున్నారు. గద్దెల పరిసరాలు, క్యూ లైన్లలో 40 మంది రెస్క్కు టీం పనిచేస్తున్నారు. గద్దెల వద్ద భక్తులు సమర్పించే బంగారాన్ని శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు తరలిస్తున్నారు.


23 మేడారం రానున్న సీఎం, గవర్నర్
వనదేవతల జాతరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, గవర్నర్‌ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం రానున్నారు. వన దేవతలు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించన్నారు. సీఎం, గవర్నర్‌, కేంద్రమంత్రి జాతరకు వస్తుండటంతో పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments