ఇనుగుర్తిలో గ్రామ దేవతలకు మొక్కులు
హాజరైన ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్యే శంకర్ నాయక్
స్పాట్ వాయిస్, కేసముద్రం: మండలంలోని కేసముద్రం గ్రామంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులంతా కలిసి గ్రామ దేవతలు ముత్యాలమ్మ, మైసమ్మకు ఆదివారం మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు హాజరై, దేవతలను దర్శించుకున్నారు. అనంతరం గ్రామస్థులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అంతట పంటపొలాలన్నీ సుభిక్షంగా ఉన్నాయని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఆదుకుంటోందని అన్నారు. రైతు సంతోషంగా ఉన్నప్పుడే గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారని పేర్కొన్నారు. ఇలాగే ప్రజలంతా కలకాలం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వద్దిరాజు సోదరులు కిషన్, దేవేందర్, వెంకటేశ్వర్లు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య, ఉపాధ్యక్షుడు ఆకుల గాంధీ, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పారా నాగేశ్వరరావు, గ్రామ సర్పంచ్ దార్ల రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Recent Comments