ఇనుగుర్తిలో టెన్షన్.. టెన్షన్..
మండలంగా ప్రకటించకపోవడంపై ఆగ్రహం..
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం..
మండల సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన
స్పాట్ వాయిస్, కేసముద్రం: మండలంలోని ఇనుగుర్తి గ్రామాన్ని 24 గంటల్లో మండలంగా ప్రకటించక పోతే అధికార పార్టీ ఇండ్ల ను ముట్టడిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. నూతన మండలాల ప్రకటన లో కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామం పేరు లేకపోవడాన్ని నిరసిస్తూ ఆదివారం గ్రామంలో ఇనుగుర్తి మండల సాధన సమితి ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో పాటు ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మంత్రి సత్యవతి, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజ్యసభ సభ్యులు రవి చంద్రతో పాటు రాష్ట్ర ప్రభుత్వం శవ యాత్ర చేపట్టారు. ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు ఇనుగుర్తి లో భారీగా మోహరించారు. ఆదోళనకారులకు ,పోలీసులకు మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. అన్ని అర్హతలు ఉన్న కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామాన్ని మండలం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల సాధన సమితి కన్వీనర్ చిన్నాల కట్టయ్య మాట్లాడుతూ.. ఇనుగుర్తి గ్రామ విద్రోహ దినంగా పాటిస్తూ బంద్ పాటిస్తామన్నారు. ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కేసముద్రం ఎస్సై రమేష్ బాబు, గూడూరు ఎస్సై సతీష్, మహబూబాబాద్ రూరల్ ఎస్సై దీపికా బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Recent Comments